తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం' - నారా భువనేశ్వరి

తెలంగాణలో రెండు ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ పేరిట విరాళాలు అందాయని.. ఈ మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

oxygen - nara bhuwaneswari
oxygen - nara bhuwaneswari

By

Published : Jun 1, 2021, 8:56 PM IST

రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ట్రస్టు సేవా కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.25 లక్షల విరాళాలు అందాయని.. న్యూజిలాండ్​లో ఉంటున్న తెలుగుదేశం మద్దతుదారులు, అభిమానులు రూ.5 లక్షలు, కృష్ణా జిల్లా వాసి గుత్తికొండ వీరభద్రరావు రూ.1.11 లక్షల విరాళాలు ఇచ్చారని భువనేశ్వరి వివరించారు.

326 మంది కోలుకున్నారు..

ఇప్పటి వరకు 690 మందికి టెలీమెడిసిన్ అందిస్తే 326 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారన్నారు. 24 గంటలూ పనిచేసే కాల్ సెంటర్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్టు నిరంతరం సేవలు అందిస్తోందని వెల్లడించారు.

ఇవీ చూడండి :DGP: లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు

ABOUT THE AUTHOR

...view details