చలానాలు పెండింగ్లో ఉన్నా.. వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు చెప్పినట్లు.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఈనెల 11న ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా.. వాహనదారుడు వారం రోజుల్లో దరఖాస్తు పెట్టుకుంటే వాహనం విడుదల చేయాలని మాత్రమే కోర్టు సూచించిందన్నారు. దీంతో సదరు వ్యక్తి వాహన చట్టం 1989 రూల్ 167 ప్రకారం.. పెండింగ్ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. కానీ చట్టం ప్రకారం వాహనం జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ కోర్టు చెప్పిందని తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు.