బల్దియా ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12న మేధోమథనం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో హైదరాబాద్ అభిృద్ధి అంశంపై కాకుండా మతపరమైన తాత్కిలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇతర పార్టీలు లబ్ధిపొందాయని భట్టి ఆరోపించారు.
'జానారెడ్డి పార్టీ మార్పు అవాస్తవం... టీ పీసీసీపై అధిష్ఠానానిదే నిర్ణయం' - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
కొన్ని పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొన్నారు. సైద్ధాంతికంగా మాత్రం కాంగ్రెస్ విజయం సాధించిందనే భావిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక లబ్ధి కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టమని స్పష్టం చేశారు.
batti vikramarka
సైద్ధాంతికంగా కాంగ్రెస్‌దే విజయమని స్పష్టం చేశారు. జానారెడ్డి పార్టీ మారుతారనే వార్తలను ఖండించారు. పీసీసీ అధ్యక్షుడి నియమాకాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి :హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్