తెలంగాణ

telangana

ETV Bharat / city

'కమిషనర్​​ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు'

నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తిరిగి ఎన్నికల ప్రధానాధికారిగా నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పును ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ఖండించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

ap education inpuster adimulau
'కమిషనర్​​ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు''కమిషనర్​​ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు'

By

Published : May 30, 2020, 4:25 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే... ఏపీ ప్రభుత్వం అనేక మార్పులు చేసిందన్న ఆయన.... ప్రభుత్వ వాదనను ఎవరూ పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్​పై ఆరోపణలు వచ్చినందున ఆర్డినెన్స్ ద్వారా కమిషనర్ పదవీ కాలాన్ని సీఎం తగ్గించారని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ వెనక్కి తగ్గే ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు.

'హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఏడాది కాలంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో భాగంగానే న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తిని నూతన ఎన్నికల కమిషనర్​గా నియమించాం'

- ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖమంత్రి

ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ABOUT THE AUTHOR

...view details