తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో రాబోయే పాలన భాజపాదే..' - భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రత్నాకర్

తెలంగాణలో రాబోయే పాలన భాజపాదేనని ఆ పార్టీ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ జోష్యం చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' పేరుతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మేము రెండేళ్లలో అధికారంలోకి వస్తాం

By

Published : Sep 23, 2019, 11:06 PM IST

మేము రెండేళ్లలో అధికారంలోకి వస్తాం

సికింద్రాబాద్​లోని మహబూబ్ కళాశాలలో ఒకే జాతీయత, ఒకే రాజ్యాంగం పేరుతో భాజపా మహిళా మోర్చ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 370 ఆర్టికల్ రద్దు, త్రిపుల్​ బిల్లుల విషయంలో తమ పార్టీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుందని భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయ రత్నాకర్ కొనియాడారు. త్రిపుల్​ తలాక్​తో ముస్లిం మహిళలకు విముక్తి లభించిందని అభిప్రాయపడ్డారు. 370 రద్దుతో కశ్మీర్​లో అభివృద్ధి వికసించనున్నదని పేర్కొన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచి భాజపా ఆగడం లేదని.. కేటీఆర్ అనడం సరికాదని రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు ఆకుల లలిత అన్నారు. గతంలో రెండు సీట్లు గెలిచిన తెరాస అధికారంలోకి రావడానికి ఐదేళ్లు పట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లలో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోని రానుందని...కేటీఆర్​ ఓటమి కాయమని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details