తెలంగాణ

telangana

ETV Bharat / city

రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్​

ఆరేళ్లలో కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని భాజపా నేతలకు కేటీఆర్​ డిమాండ్ చేశారు. ​అసలు భాజపాకు ఎందుకు ఓటువేయాలో... ఈ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఖైతరాబాద్ లైబ్రరీ సెంటర్​ వద్ద రోడ్​ షోలో కేంద్రం, భాజపా నాయకులపై విమర్శణాస్త్రాలు ఎక్కుపెట్టారు.

ktr
ktr

By

Published : Nov 22, 2020, 8:13 PM IST

Updated : Nov 22, 2020, 10:28 PM IST

'ఒకప్పుడు 14 రోజులకొకసారి నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు రోజు తప్పి రోజు వస్తున్నాయ్.. కరెంట్ కష్టం, తాగునీటి తండ్లాట పోయింది.. 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం.. శాంతిభద్రల సమస్యలు లేనందున పెట్టుబడులు వస్తున్నాయ్'​ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.

ఆరేళ్లలో కేంద్రం నుంచి సికింద్రాబాద్​ పార్లమెంట్​కు రూపాయైనా కిషన్ రెడ్డి తీసుకొచ్చారా అని ప్రజలు నిలదీయాలని కేటీఆర్​ సూచించారు. వారికి ఎందుకు ఓటు వెయ్యాలో ప్రశ్నించాలన్నారు. గత ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు కట్టామని.. రాష్ట్రానికి మాత్రం కేవలం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. రూపాయి మనమిస్తే.. ఆఠాణ మనకిస్తున్నారని మండిపడ్డారు.

కష్టంలో మనమున్నాం.. కన్నీళ్లు తుడిచామని.. 6.50 లక్షల మందికి రూ.10వేలు ఇస్తే... ఆ కార్యక్రమానికి మోకాలు అడ్డుపెట్టారని ధ్వజమెత్తారు. ప్రధానిని ఒప్పించి 6.50 లక్షల మందికి రూ.25 వేలు ఇప్పిస్తే తామే చప్పట్లు కొడతామని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.67వేల కోట్లు ఖర్చుచేసిందన్న కేటీఆర్​.. మోదీ ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి:భాజపాపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలి: కేటీఆర్​

Last Updated : Nov 22, 2020, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details