తెలంగాణ

telangana

ETV Bharat / city

అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్‌

central jal Shakthi minister gajendra singh shekavat
అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్‌

By

Published : Oct 6, 2020, 3:34 PM IST

Updated : Oct 6, 2020, 5:02 PM IST

15:31 October 06

అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్‌

అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్‌

      రెండు రాష్ట్రాలు లేవనెత్తిన పలు అంశాలపై చర్చించినట్లు కేంద్ర మంత్రి షెకావత్​ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ అధ్యక్షతన అపెక్స్​ కౌన్సిల్​ భేటీ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కేసీఆర్​, జగన్​ హాజరయ్యారు. భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని షెకావత్‌ అన్నారు.  

కేసీఆర్ కేసులు వెనక్కి తీసుకుంటామన్నారు..

     కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదేనని షెకావత్‌ పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారని.. అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను త్వరలోనే నిర్ణయిస్తామని వెల్లడించారు. నదీజలాల పంపిణీపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ చెప్పారని ..షెకావత్‌ వెల్లడించారు. కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపరమైన అంశాలు పరిశీలించి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.  

చట్టప్రకారమే ముందుకెళ్తాం..

      నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదన్నారు. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించామని.. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే ముందుకెళ్తామని కేంద్ర జల్​శక్తి మంత్రి పేర్కొన్నారు.  

     పోలవరానికి బిల్లులు ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేశామన్న మంత్రి.. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయాలనేది మా లక్ష్యమన్నారు. వీలైతే ఈ నెలాఖరులో ప్రాజెక్టును సందర్శిస్తానని షెకావత్‌ ప్రకటించారు.  

ఇవీచూడండి:ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్‌

Last Updated : Oct 6, 2020, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details