నీటి సమస్యలపై గ్రేటర్లో 41 రోజుల ప్రత్యేక డ్రైవ్ - water problems in hyderabad
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నీటి సమస్యలపై వాటర్ వర్స్క్ విభాగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. 41 రోజుల పాటు నిర్వహించనున్న ఈ డ్రైవ్లో పలు సమస్యలకు పరిష్కారం చూపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ వర్క్స్ విభాగం వివిధ రకాల సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, బిల్లులు చెల్లించని వినియోగదారులు, బిల్లులపై అధిక రుసుము లాంటి సమస్యలకు ఈ డ్రైవ్లో పరిష్కారాలు చూపనున్నారు. 41 రోజుల పాటు జరగనున్న ప్రత్యేక డ్రైవ్లో చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులకు మంచి సేవలందిస్తామని మలక్‌పేట వాటర్ వర్క్స్ ప్రత్యేక అధికారి రవి తెలిపారు. ఈ డ్రైవ్లో వడ్డీ మాఫీతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని రవి వివరించారు.