తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద... 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. భారీగా వస్తున్న వరద నీటిని జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులు ఉండగా, నీటి నిల్వ 213.4011 టీఎంసీలకు చేరింది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద... 10 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద... 10 గేట్లు ఎత్తివేత

By

Published : Sep 19, 2020, 6:05 PM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని దిగువ నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 3,77,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి ఇన్​ఫ్లో 2,08,452 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 4,04,377 క్యూసెక్కులు ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 213.4011 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి :శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదపోటు.. 36 గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details