తెలంగాణ

telangana

ETV Bharat / city

నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తిన అధికారులు... భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని మరో ఏడు గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల
నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల

By

Published : Aug 17, 2020, 5:07 PM IST

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలో భారీ వర్షాల ధాటికి 40 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. సోమవారం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని జలాశయం అధికారులను కేంద్ర జల సంఘం హెచ్చరించింది.

ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ వంద టీఎంసీలు కాగా.. ఇప్పటికే 99 టీఎంసీల నీటిని నిలువ చేశారు. ఆదివారం రాత్రి మూడు గేట్లను తెరిచిన అధికారులు... ఇన్​ ఫ్లో పెరగడంతో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పదిగేట్లు ఎత్తి, 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హెచ్​ఎల్​సీ, ఎల్​ఎల్​సీ కాలువలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది.

నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details