తెలంగాణ

telangana

ETV Bharat / city

Srisailam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. 10 గేట్లు ఎత్తివేత - telangana latest updates

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రసుత నీటిమట్టం 884.10 అడుగుల వద్ద కొనసాగుతోంది.

Srisailam water flow, Srisailam reservoir
నిండుకుండలా శ్రీశైలం జలాశయం, శ్రీశైలం గేట్లు ఎత్తివేత

By

Published : Jul 30, 2021, 1:05 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5,00,203 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 211.5133 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

సందర్శకుల తాకిడి

2007 తర్వాత జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. శ్రీశైలం గేట్లు ఎత్తగా... సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసి మురిసిపోయారు. శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.

సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు

రెండ్రోజుల్లో నాగార్జునసాగర్(NagarjunaSagar) జలకళను సంతరించుకోనుంది. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు తెరవడం వల్ల పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలాలు.. సాగర్​ను చేరనున్నాయి. సాగర్‌లో గురువారం సాయంత్రానికి మరో 96 టీఎంసీలు ఖాళీ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 553.10 అడుగుల వద్ద ఉంది. సాగర్‌ వద్ద ఇన్‌ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులు ఉండగా శ్రీశైలం నుంచి విడుదలవుతోంది. రోజుకు దాదాపు 37 టీఎంసీలకు పైగా నిల్వ పెరగనుండగా ఆదివారం నాటికి సాగర్‌ పూర్తి స్థాయి మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఎప్పుడోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది ఆగస్టు 11న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయగా.. ఈ దఫా వారం ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశముందని ఎన్‌ఎస్‌పీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:NagarjunaSagar : రెండు రోజుల్లో సాగర్‌ను తాకనున్న శ్రీశైలం జలాలు

ABOUT THE AUTHOR

...view details