GUNDLAKAMMA PROJECT: దెబ్బతిన్న గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్.. భారీగా నీటి వృథా - GUNDLAKAMMA PROJECT
GUNDLAKAMMA PROJECT: ఏపీలోని ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ జలాశయం స్పిల్‌వేలోని ఓ గేట్ దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. స్పిల్‌వేలోని మూడో గేటు అడుగుభాగం విడిపోవడంతో.. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయం నుంచి నీరు దిగువకు లీకవుతోంది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 3.97 టీఎంసీలు.. అయితే ఖరీఫ్‌లో సాగు కోసం జలాశయంలో నీటిని నిల్వ చేశారు. జలాశయం నుంచి నీరు లీక్ అవడంతో అందులో ఉన్న మృత్య్స సంపదపై జాలరులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఎమ్మెల్యేలు కరణం బలరామ్, సుధాకర్ పరిశీలించారు.
GUNDLAKAMMA PROJECT