ఏపీలోని కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు, మున్నేరు, కట్లేరు, వైరా తదితర వాగుల నుంచి 1,24,250 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని జలవనరుల శాఖ వెల్లడించింది. ప్రకాశం బ్యారేజీలో 3 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండటంతో.. 70 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Prakasham: ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం.. 70 గేట్లు ఎత్తి దిగువకు విడుదల - కృష్ణ నదికి వరద
ఏపీ కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,24,250 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 70 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
water-flow-increased-to-prakasham-barriage
ప్రస్తుతం బ్యారేజీ దిగువన సముద్రంలోనికి 1,25,811 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాల్వలకు 1561 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉందని జలవనరుల శాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: