తెలంగాణ

telangana

ETV Bharat / city

viral video: ప్రభుత్వ పథకాలకు కొత్త షరతులు.. డబ్బులు ముట్టజెప్పితేనే అర్హులంట..! - వార్డు వాలంటీర్ న్యూస్

ఏపీలో చేయూత పథకానికి రూ. 2 వేలు, పింఛనుకు రూ. 3 వేలు, ఇంటి స్థలానికి రూ. 5 వేలు. ఏంటీ ఈ లెక్క అనుకుంటున్నారా..? ఇది ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న మెుత్తం అనుకుంటే మీరు పొరబడినట్లే ! ఆ పథకాలు మీకు అందాలంటే ముట్టజెప్పాల్సిన ముడుపుల లెక్క. అవునండీ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణ 27వ వార్డు వాలంటీర్..ఏ పథకానికి ఎంత సమర్పించుకోవాలో తన పరిధిలోని అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ వివరిస్తోంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

volunteer in AP
గుంటూరులో వాలంటీర్​ నిర్వాకం.. వైరలైన వీడియో

By

Published : Jun 10, 2021, 9:25 PM IST

Updated : Jun 10, 2021, 10:44 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట 27వ వార్డు వాలంటీర్ సోనీ.. ప్రభుత్వ పథకాలు కావాలంటే ఏ పథకానికి ఎంత సమర్పించుకోవాలో తన పరిధిలోని ఒక ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు చెబుతున్న వీడియో వైరల్​గా మారింది. ఎలాంటి భయం లేకుండా బరితెగింపుగా ప్రభుత్వ పథకాలు రావాలంటే ఎంత ముడుపులు ముట్టజెప్పాలో నిస్సిగ్గుగా వివరించింది. కొత్త పింఛన్ కావాలంటే రూ.3 వేలు, ఇళ్ల స్థలానికి రూ. 5 వేలు, చేయాతకు రూ. 2 వేలు అంటూ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ధర చెబుతూ లంచం డిమాండ్ చేసింది. ముడుపులు ముందుగా చెల్లిస్తేనే..లబ్ధిదారుల దరఖాస్తును ఆన్​లైన్ చేస్తామని వివరించింది.

ప్రభుత్వం ఈసారి కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని.. ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని లబ్ధిదారులకు వివరించింది. ఈ మొత్తం తమ పై అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని నిర్భయంగా వెల్లడించింది. ప్రభుత్వం పథకాలు కావాలంటే తనకు ఫోన్ చేసి సంప్రదించాలని ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తే.. పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తామని తెలిపింది. ఎట్టకేలకు వైరల్ వీడియో అధికారుల దృష్టికి చేరటంతో కమిషనర్ సదరు వాలంటీర్ సోనీని విధుల నుంచి తొలగించారు.

గుంటూరులో వాలంటీర్​ నిర్వాకం.. వైరలైన వీడియో

ఇదీచదవండి: EATALA:ఈ నెల 14న భాజపాలో చేరనున్న ఈటల రాజేందర్‌

Last Updated : Jun 10, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details