తెరాసను నమ్మి అధికారమిస్తే... రాష్ట్ర ప్రజలను, యువతను సీఎం కేసీఆర్ మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని... కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే యువతకు న్యాయం జరుగుతుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు... హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
'కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే యువతకు న్యాయం' - warangal news
వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి చెంది వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు... హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
warangal leaders joined in congress
రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఉత్తమ్ సూచించారు.