తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పద సంచారం.. ఐదుగురు అరెస్ట్ - ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానస్పద సంచారం.. ఐదుగురు అరెస్ట్

ఏపీలోని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి అతిథి గృహం వద్ద అపరిచితుల అనుమానాస్పద సంచారం కలకలం రేపింది. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానస్పద సంచారం.. ఐదుగురు అరెస్ట్
ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానస్పద సంచారం.. ఐదుగురు అరెస్ట్

By

Published : Sep 24, 2020, 12:54 PM IST

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అతిథిగృహం వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఓ తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దుండగులు అనంతపురం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

బోయినపల్లికి సమీపంలోని బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి నివాసం ఉంది. ఈ నివాసానికి సమీపంలో కొంతమంది అనుమానితులు తిరుగుతుండటాన్ని హైవేలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. వారిలో కొందరు పరారవగా.. ఐదుగురు పట్టుబడ్డారు. అనుమానితులను మన్నూరు పీఎస్‌కు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో వీరంతా ఎందుకున్నారు? అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:డ్రగ్స్​: వ్యవసం.. వ్యాపారం.. అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details