తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ - CM KCR meets with trade union leaders

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కసరత్తు వారం, పదిరోజుల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ చర్చల తర్వాత... ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగసంఘాల నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Wage revision process will begin soon in Telangana
తెలంగాణ వేతన సవరణకు కసరత్తు

By

Published : Jan 17, 2021, 7:12 AM IST

వేతన సవరణ అంశం ప్రభుత్వ ఉద్యోగులను ఊరిస్తోంది. డిసెంబర్ 31న పీఆర్సీ కమిషన్‌..ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ... ఆ తర్వాత వారం ఉద్యోగసంఘాలతో చర్చలు జరుపుతుందని........ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 6,7 తేదీల్లో చర్చలు జరుగుతాయని అంతా భావించినా అవి జరగలేదు.

ఇప్పటికే చాలా ఆలస్యమైనందున వెంటనే వేతనసవరణ ప్రకటించాలని..కొన్ని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో నిరాహార దీక్ష.. జిల్లాలు, మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. పీఆర్సీ కమిషన్ సమర్పించిన నివేదికను.......అందరికీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాయి.

ఉద్యోగసంఘాలతో చర్చల విషయమై రాష్ట్రప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇతర ఉద్యోగసంఘాలు సైతం సర్కారు పిలుపు కోసం ఎదురుచూస్తున్నాయి. కమిషన్ ఇచ్చిన నివేదికపై..... ముఖ్యమంత్రితో చర్చించాకే అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న వారం రోజుల్లో ఆ ప్రక్రియ జరగవచ్చని సమాచారం. గుర్తింపుపొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో.... అధికారుల కమిటీ చర్చలు జరిపేఅవకాశాలున్నాయంటున్నారు. ఆ తర్వాత వేతనసవరణపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. నిర్ణయానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉద్యోగసంఘాలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

వేతన సవరణతో పాటు పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఉద్యోగుల సంబంధిత అన్ని అంశాలపై ప్రభుత్వం ఒకే మారు నిర్ణయం ప్రకటిస్తుందని అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. సంబంధిత దస్త్రం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినట్లు తెలిసింది. 600కు పైగా ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకొచ్చే విషయమై త్వరలోనే నిర్ణయం వస్తుందని ఉద్యోగసంఘాలు అంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details