Vundavalli Sridevi protest at Sucharitha house : గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. పార్టీ అధిష్ఠానం.. డొక్కాను తాడికొండ అదనపు సమన్వయకర్తగా నియమించి దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డొక్కా నియామకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుచరిత ఇంటి ముందు నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి నిరసన వ్యక్తం చేశారు.
సుచరిత ఇంటి వద్ద ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసన - Undavalli Sridevi on dokka
Vundavalli Sridevi protest at Sucharitha house ఏపీలోని తాడికొండ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు. పార్టీ అధిష్టానంతో మాట్లాడదామని ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు.
Vundavalli Sridevi protest at Sucharitha house
గత ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన డొక్కాను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీదేవికి సుచరిత నచ్చచెప్పారు. పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామనటంతో నేతలు ఆందోళన విరమించారు. మరోవైపు ఇవాళ పార్టీ అధినేతను కలిసేందుకు తాడికొండ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 10 గంటల్లోగా పార్టీ నిర్ణయం మార్చకుంటే నాలుగు మండలాల్లోని ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తామని ప్రకటించారు.