జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు స్లిప్ డౌన్లోడ్, పోలింగ్ బూత్ వివరాలను మై జీహెచ్ఎంసీ యాప్‌లో బల్దియా పొందుపర్చింది. ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం వివరాలే కాకుండా... పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ కూడా అందుబాటులో ఉంచారు. నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉన్నందున... ఈ సౌకర్యాన్ని రూపొందించారు.
మై జీహెచ్ఎంసీ యాప్‌లో ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం లొకేషన్ - ఓటర్ స్లిప్ డౌన్లోడ్
నగర ఓటర్ల సౌకర్యార్థం బల్దియా మై జీహెచ్ఎంసీ యాప్ రూపొందించింది. ఓటరు స్లిప్ డౌన్లోడ్, పోలింగ్ బూత్ వివరాలను యాప్ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఓటర్ స్లిప్‌తోపాటు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్‌తో సహా వస్తుంది.
![మై జీహెచ్ఎంసీ యాప్‌లో ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం లొకేషన్ voter slip download polling center location details from my ghmc app](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9695623-thumbnail-3x2-vote.jpg)
మై జీహెచ్ఎంసీ యాప్‌లో ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం లొకేషన్
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మైజీహెచ్ఎంసీ యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్ క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు వివరాలు ఎంటర్ చేసి... పూర్తి వివరాలు పొందవచ్చు. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది. ఈ యాప్ పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా బల్దియా సమాచారం అందిస్తోంది.
ఇదీ చూడండి:ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా