ఏపీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రత్తిపాడులో మంచానికే పరిమితమైన వృద్ధుడిని ఓటు వేసేందుకు అదే మంచంపై బంధువులు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. వృద్ధుడిని పోలింగ్ కేంద్రం బయటే ఉంచిన అధికారులు.. అతడి వేలిముద్ర తీసుకుని ఓటు వేయించారు.
నడవలేకపోయినా.. కర్తవ్యాన్ని మరవలేదు - pratthipadu elections
మంచంపై నుంచి లేచేందుకు ఓపిక లేకపోయినా... నడవలేని స్థితిలో ఉన్నా.. ఆ వృద్ధుడు తన కర్తవ్యాన్ని మరవలేదు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వరకు మంచంపైనే వచ్చి.. ఓటు వేశాడు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటుచేసుకుంది.
నడవలేకపోయినా.. కర్తవ్యాన్ని మరవలేదు