తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటింగ్‌ శాతం పెంచడానికి చైతన్య కార్యక్రమాలు: లోకేశ్‌ కుమార్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడానికి పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్ తెలిపారు. దీని కోసం స్వయం సహాయక బృందాల సహాయంతో ఓట‌రు చైత‌న్య కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఓటర్లు 'మై జీహెచ్ఎంసీ యాప్' ద్వారా ఓట‌రు స్లిప్‌ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

voter awareness programs for ghmc elections
ఓటింగ్‌ శాతం పెంచడానికి చైతన్య కార్యక్రమాలు: లోకేశ్‌ కుమార్‌

By

Published : Nov 29, 2020, 7:35 PM IST

గ్రేటర్ ఎన్నిక‌ల ఓటింగ్ శాతం పెంపునకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల ద్వారా ఓట‌రు చైత‌న్య కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. స‌ర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ స‌మావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల‌ పంపిణీ చేస్తున్నట్లు అధికారి చెప్పారు. 'మై జీహెచ్ఎంసీ యాప్' నుంచి ఓట‌రు స్లిప్‌ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో 'నో యువర్ ఓట్' ఆప్షన్‌లో పేరు, వార్డు నంబర్ ఎంటర్‌ చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ వస్తుందని సూచించారు.

ఇదీ చదవండి:బల్దియా ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు: సీపీ మహేశ్ భగవత్

ABOUT THE AUTHOR

...view details