ఓటుకు నోటు కేసులో నాంపల్లి అనిశా కోర్టుకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య కోర్టుకు వచ్చారు. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని ఇటీవల సండ్ర వేసిన పిటిషన్‌ను అనిశా కోర్టు కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా - ఓటుకు నోట
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. ఈ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని అనిశా న్యాయస్థానం ఆదేశించగా.. నిందితులుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి,
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా
ఓటుకు నోటు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని అనిశా న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి:అంతర్జాలం అనుకూలించదు.. సాంకేతికత సహకరించదు!