ఓటుకు నోటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదని ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అవినీతి నిరోధక శాఖ కోరింది. అనిశా అభియోగాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
ఈనెల 31కు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా - ఓటుకు నోటు కేసు తాజా వార్తలు
ఓటుకు నోటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదని రేవంత్రెడ్డి వేసిన పిటిషన్పై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ కొట్టేసిన తర్వతే విచారణ కొనసాగించాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను న్యాయస్థానం ఈనెల 31కి వాయిదా వేసింది.
vote for note case adjournment to december 31
రేవంత్ రెడ్డి పిటిషన్ను కొట్టేసి విచారణ కొనసాగించాలని అధికారులు కోరారు. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది.