తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడే ఒంటిమిట్టలో సీతారాములు కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం - ap latest news

పండు వెన్నెల్లో రాములోరి కల్యాణానికి ఏపీలోని ఒంటిమిట్ట అంగరంగవైభవంగా ముస్తాబైంది. ఈ రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ... అశేష భక్త జనుల సమక్షంలో కల్యాణం కమనీయంగా సాగనుంది. సీఎం జగన్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

vontimitta-srirama-kalyanam-today
vontimitta-srirama-kalyanam-today

By

Published : Apr 15, 2022, 9:36 AM IST

నేడే ఒంటిమిట్టలో సీతారాములు కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

యావత్‌ దేశమంతా సీతారాముల కల్యాణం నవమిరోజు పట్టపగలు జరిగితే ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ‍ఒంటిమిట్టలోమాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ముహూర్తం నిర్ణయించారు. పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వల్ల... ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్లు.. ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు.... ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

సీఎం జగన్ తొలిసారి: కరోనా కారణంగా రెండేళ్లు ఏకాంతంగా స్వామివారి కల్యాణం నిర్వహించిన తితిదే.. ఈసారి మాత్రం 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం జగన్ తొలిసారి ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవానికి హాజరవుతున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి వివాహ వేడుకల్ని తిలకించనున్నారు. సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా తితిదే ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంచినీరు, భోజనాలు సిద్ధం చేసింది.

ట్రాఫిక్ ఆంక్షలు:కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల కోసం కౌంటర్లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కడప-రేణిగుంట ప్రధాన జాతీయ రహదారిలో ఒంటిమిట్ట ఉండటంతో ఈ మార్గంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details