తెలంగాణ

telangana

ETV Bharat / city

వాలంటీర్ల అత్యుత్సాహం రెండు గ్రామాల మధ్య వివాదం - volunteers over action in nellore district

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ వాలంటీర్ల ప్రవర్తన రెండు గ్రామాల మధ్య గొడవపెట్టింది. మహిమలూరు గ్రామంలోకి రావద్దంటూ వాలంటీర్లు రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దెపూరు గ్రామస్థులను పొలం పనులకు వెళ్లనివ్వలేదు. దీనిపై ఆగ్రహించిన దెపూరు గ్రామస్థులు వారిని గ్రామంలోకి రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు.

volunteers over action
వాలంటీర్ల అత్యుత్సాహం… రెండు గ్రామాల మధ్య చిచ్చు

By

Published : Apr 30, 2020, 2:36 PM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామ వాలంటీర్ల అత్యుత్సాహం రెండు గ్రామాల మధ్య వివాదానికి దారి తీసింది. తమ గ్రామం మీదుగా వెళ్లడానికి లేదంటూ.. మహిమలూరు గ్రామ వాలంటీర్లు రోడ్డుపై ముళ్ల కంచె వేశారు. పొలాల్లోకి సొంత పనులకు వెళ్లనీయకుండా దెపూరు గ్రామానికి చెందిన రైతులను అడ్డుకున్నారు. దెపూరు గ్రామస్థులు ఎంత చెప్పినా.. వాలంటీర్లు వినకపోవడం వల్ల చేసేదేమీ లేక వెనక్కు వెళ్లిపోయారు.

అనంతరం తమ గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి మహిమలూరు గ్రామస్థులు రాకుండా దెపూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనివల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా గ్రామాల ప్రజలు మహిమలూరు మీదుగా వెళ్తుంటారని.. వాలంటీర్లు ఇలా అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు గ్రామాల ప్రజలకు నచ్చజెప్పారు.

వాలంటీర్ల అత్యుత్సాహం… రెండు గ్రామాల మధ్య చిచ్చు

ఇవీచూడండి:మూడు రోజుల పాటు లాక్​డౌన్​ ఎత్తివేయండి: తలసాని

ABOUT THE AUTHOR

...view details