ఏబీ వెంకటేశ్వరావుకు ముందస్తు బెయిల్ మంజూరు - ఏబీ వెంకటేశ్వరరావు కేసు తాజా వార్తలు
ఏబీ వెంకటేశ్వరావుకు ముందస్తు బెయిల్ మంజూరు
15:01 May 03
ఏబీ వెంకటేశ్వరావుకు ముందస్తు బెయిల్ మంజూరు
సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు శాఖలో రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనపై అ.ని.శా నమోదు చేసిన కేసులో.. తనను అరెస్టు చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి:ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్‌కు బలవుతున్న ఉద్యోగులు