విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫిబ్రవరి 12కి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఏడో తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని పోరాట సమితి నాయకులు చెప్పారు. కేంద్రం వెనక్కు తగ్గేంత వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఫలితంగా భాజపా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్‌కు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది.
- ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
- ఫిబ్రవరి 12న 365 జెండాలతో నిరసన
- ఫిబ్రవరి 13న స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి బైక్ యాత్ర
- స్టీల్‌ప్లాంట్ నుంచి విశాఖ భాజపా కార్యాలయం వరకు బైక్ యాత్ర
- విశాఖ భాజపా కార్యాలయం ముట్టడించనున్న నాయకులు
- ఫిబ్రవరి 23న రాష్ట్ర బంద్