ప్రాణభయం... తప్పని లాక్‌డౌన్ సంకటం...! - vizag LG polymers surrounding people moving to srikakulam
ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప గ్రామాల ప్రజలు శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నారు. విశాఖపట్నం నుంచి కార్లు, ద్విచక్రవాహనాల్లో వెళ్తున్న వారిని... పైడిభీమవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా అడ్డుకోవాల్సి వస్తోందని పోలీసులు చెబుతున్నారు. క్వారంటైన్‌లో ఉంటే పంపిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో చేసేదేమీలేక విశాఖ వాసులు వెనుదిరిగి వస్తున్నారు.
ప్రాణభయం... తప్పని లాక్‌డౌన్ సంకటం...!
గురువారం తెల్లవారుజాము నుంచి ఏపీ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి పలు దఫాలుగా స్టైరీన్ గ్యాస్ లీక్ అవడంతో 12 మంది మృతిచెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి మరోసారి గ్యాస్ లీకైన వాసన రావడంతో... విశాఖ వాసులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కరోనా నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో... వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.