తెలంగాణ

telangana

ETV Bharat / city

viveka murder case: వివేకా హత్య కేసులో.. రంగన్న చెప్పిన కీలక విషయం ఏంటి?

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో కీలక ముందడుగు పడింది. హత్య జరిగిన రోజు ఆయన ఇంటివద్ద కాపలాగా ఉన్న రంగయ్య.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. రంగయ్య కీలక విషయాలు వెల్లడించారంటూ.. విస్తృత ప్రచారం జరుగుతోంది.

viveka murder case: వివేకా హత్య కేసులో.. రంగన్న చెప్పిన కీలక విషయం ఏంటి?
viveka murder case: వివేకా హత్య కేసులో.. రంగన్న చెప్పిన కీలక విషయం ఏంటి?

By

Published : Jul 24, 2021, 9:33 AM IST

viveka murder case: వివేకా హత్య కేసులో.. రంగన్న చెప్పిన కీలక విషయం ఏంటి?

వివేకా హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case) లో సీబీఐ దర్యాప్తు కొలిక్కివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వివేకా ఇంటి కాపలాదారు రంగన్న... జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో.. భాగంగా సీబీఐ రంగన్నను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. చివరికి ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. సుమారు 45 నిమిషాలపాటు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సమయంలో.. కోర్టు గదిలో రంగన్నతో పాటు న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఇతరులు ఎవ్వరికీ లోనికి అనుమతి ఇవ్వలేదు. ఈ వాంగ్మూలాన్ని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టు.. న్యాయమూర్తికి పంపనున్నారు. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వివరించారని ప్రచారం జరుగుతోంది.

తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరించారని.. అందుకే తాను భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదని రంగన్న తెలిపారు. సీబీఐ అధికారులు తనపై ఈగ వాలనివ్వబోమని హామీ ఇచ్చినట్లు వివరించారు. న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చిన.. అనంతరం పులివెందులలో స్థానికులు, విలేకర్లతో రంగన్న ఈ విషయాలు వెల్లడించారు. న్యాయమూర్తికి ఏం చెప్పావని అడిగితే.. తనకు భయమేస్తోందని సమాధానం ఇచ్చారు. భయపడాల్సిన పని లేదని పదేపదే అడగ్గా.. అక్కడున్నవారి చెవిలో.. ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను చెప్పారు. అంతకు ముందు మాత్రం తాను న్యాయమూర్తితో ఏం చెప్పానో గుర్తులేదని... రంగన్న అన్నారు.

కర్నూలు జిల్లా కాశీపురానికి చెందిన రంగన్న.. తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పనిచేశారు. 2017 నుంచి వివేకా ఇంటికి... కాపలాదారుగా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే కాపలాగా ఉన్నారు. వివేకా బతికి ఉండగా చివరిసారి, రక్తపు మడుగులో ఉన్నాక మొదటిసారి చూసిందీ రంగన్నే. వివేకా కుమార్తె సునీత సైతం అనుమానితుల జాబితాలో... రంగన్న పేరును హైకోర్టుకు సమర్పించారు. రంగన్నకు హత్య విషయాలు తెలిసే అవకాశం ఉందని, అవి బయటపెడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పకపోవచ్చని సునీత కోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రస్తావించారు. రంగన్న వాంగ్మూలం నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో తమ అరెస్ట్‌తోపాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని.. సునీల్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీబీఐ అవసరమని భావిస్తే.. న్యాయవాది సమక్షంలోనే విచారించేలా ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి: ys viveka murder case: వివేక హత్య కేసు దర్యాప్తు అధికారులు మార్పు... కొనసాగుతున్న విచారణ

ABOUT THE AUTHOR

...view details