ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు డ్రైవర్ దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు తనకు రక్షణ కల్పించట్లేదని ఆరోపించారు. పులివెందుల దాటి వెళ్తే తన వెంట సెక్యూరిటీ రావట్లేదని.. తనకు కేటాయించిన గన్‌మెన్లు తనతో ఉండట్లేదని ఆరోపించారు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేసి సెక్యూరిటీ పంపాలని కోరటం ఇబ్బందిగా మారిందన్నారు. తనకు ప్రాణహాని జరిగితే తిరిగి తీసుకురాగలరా? అని ప్రశ్నించారు.
"కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు. పులివెందుల దాటి వెళ్తే నా వెంట సెక్యూరిటీ రావట్లేదు. నాకు ఇచ్చిన గన్‌మెన్లు నాతో ఉండట్లేదు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసి సెక్యూరిటీ పంపాలని కోరడం ఇబ్బందిగా ఉంది. నాకు ప్రాణాహాని జరిగితే మళ్లీ నా ప్రాణాలు తెస్తారా? నా కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప నాకు రక్షణగా ఉన్నట్లు లేదు."
- దస్తగిరి, వివేకా హత్య కేసు నిందితుడు