తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మెజిస్ట్రేట్ ముందుకు డ్రైవర్​ దస్తగిరి..!

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. డ్రైవర్ దస్తగిరి మరోసారి విచారణకు హాజరయ్యారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉంది.

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మెజిస్ట్రేట్ ముందుకు డ్రైవర్​ దస్తగిరి..!
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మెజిస్ట్రేట్ ముందుకు డ్రైవర్​ దస్తగిరి..!

By

Published : Aug 26, 2021, 5:31 PM IST

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 81వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ విచారణకు డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. దస్తగిరి అత్త మాబున్నీసాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు దస్తగిరిని హాజరుపరిచే అవకాశం ఉంది. సెక్షన్‌ 164 కింద దస్తగిరి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సమాచారం.

సమాచారమిస్తే రివార్డు..

వివేకా హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 21న పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని..హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి: Viveka Murder Case: నలుగురు అనుమానితుల చుట్టూనే వివేకా హత్య కేసు దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details