తెలంగాణ

telangana

ETV Bharat / city

జూపార్కులో సందర్శకుల సందడి.. నిబంధనలు తప్పనిసరి - నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ తాజావార్తలు

కరోనా కారణంగా మూతపడిన నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌... దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...సందర్శకులకు అనుమతిస్తున్నారు. ప్రారంభమైన మొదటిరోజే పదకొండు వందల 37 మంది జూపార్క్​ను సందర్శించారని జూపార్కు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి వెల్లడించారు.

Visitors allowed into the Nehru Zoological Park with Kovid rules in Hyderabad
కొవిడ్‌ నిబంధనలతో జూపార్క్​లోకి సందర్శకుల అనుమతి

By

Published : Oct 7, 2020, 10:42 AM IST

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శనశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన నెహ్రూ జూలాజికల్‌ పార్కు మళ్లీ ప్రారంభంకావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.....థర్మల్‌ స్రీనింగ్‌ చేసిన అనంతరం మాస్కులు ధరించిన వారినే అనుమతిస్తున్నారు.

కొవిడ్ -19 నేపథ్యంలో జూపార్కుకు వచ్చే సందర్శకులకు ఎటువంటి సదుపాయాలు కల్పించారు. నగదురహిత లావాదేవీలు ఎలా అమలుచేస్తున్నారు. తదితర వివరాలను జూపార్కు డిప్యూటీ క్యూరేటర్ నాగమణితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

కొవిడ్‌ నిబంధనలతో జూపార్క్​లోకి సందర్శకుల అనుమతి

ఇదీ చదవండి:'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'

ABOUT THE AUTHOR

...view details