తెలంగాణ

telangana

ETV Bharat / city

‘డెంటన్స్‌’లో మొట్ట మొదటి భారతీయురాలు.. తెలుగు మహిళకు కీలక పదవి! - telangana news

ఏపీలోని విశాఖకు చెందిన నీలిమ పాలడుగు.. ప్రపంచంలో అతిపెద్ద లా సంస్థగా గుర్తింపు పొందిన డెంటన్స్​​లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డెల్లాయిట్ కంపెనీలో గ్లోబల్‌ పీపుల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్​గా పని చేస్తున్నారు. భారతీయురాలికి ఇలాంటి పదవి దక్కడం ఇదే తొలిసారి.

vishaka woman new record, first india woman in america
తెలుగు మహిళకు కీలక పదవి, అమెరికాలో తెలుగు మహిళ కీలక పదవి

By

Published : Oct 17, 2021, 10:22 AM IST

ప్రపంచంలో అతిపెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన ‘డెంటన్స్‌’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖకు చెందిన నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ తరహా కంపెనీలో గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా పదవి దక్కడం ఇదే తొలిసారి. నీలిమ పాలడుగు ప్రస్తుతం అమెరికాలోని డెల్లాయిట్‌ కంపెనీలో ‘గ్లోబల్‌ పీపుల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌’గా పని చేస్తున్నారు.

205కి పైగా దేశాలలో విస్తరించిన డెంటన్స్‌లో.. నవంబరు 15న ఆమె చేరనున్నారు. నీలిమ రాకతో తమ వాణిజ్య కార్యకలాపాలలో మానవ వనరుల నిర్వహణ వ్యూహాలు మరింత పటిష్ఠంగా అమలవుతాయని డెంటన్స్‌ గ్లోబల్‌ సీఈవో ఎల్లైట్‌ పోర్టోని వ్యాఖ్యానించారు.

నీలిమ కుటుంబం చూస్తే.. తల్లిదండ్రులు ఉప్పలపాటి సాయిరాణి, రాజా. భర్త సుధాకర్‌ పాలడుగు. కుమార్తె రియా, కుమారుడు సునీల్‌. నీలిమ విశాఖలోని కొటక్‌ పాఠశాలలో పది, సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశారు. మెరిల్‌ లించ్‌, పీడబ్ల్యూసీ, ఐబీఎం వంటి కంపెనీలలో మానవ వనరుల విభాగంలో ఆమె పనిచేశారు.

ఇదీ చదవండి:Alai-Balai 2021: 'తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్‌-బలయ్‌'

ABOUT THE AUTHOR

...view details