flight services: ఆగస్టు 1 నుంచి విజయవాడ - విశాఖ విమాన సర్వీసు - విజయవాడ వార్తలు
ఆగస్టు 1నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ - విశాఖ నూతన విమాన సర్వీసు ప్రారంభం కానుంది. వారానికి నాలుగు రోజులు ఈ సర్వీసులు నడపనున్నట్లు ఇండిగో ప్రతినిధులు తెలిపారు.
vishakha-vijayawada-airline-service-starts-from-august-1
ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ - విశాఖపట్నం మధ్య ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఈ సర్వీసు నడపనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరిన విమానం... సాయంత్రం 5.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 5.20 గంటలకు విశాఖలో బయలుదేరి 6.25 గంటలకు విజయవాడ చేరుకుంటుందని పేర్కొన్నారు.