తెలంగాణ

telangana

ETV Bharat / city

Most popular book: అమెజాన్‌ మోస్ట్ పాపులర్ బుక్‌-2021గా విశాఖ రచయిత పుస్తకం ఎంపిక - amazons-most-popular-book-2021

Most popular book: అమెజాన్‌ మోస్ట్ పాపులర్ బుక్‌-2021గా విశాఖకు చెందిన రచయిత శ్రీధర్​ బెవర రాసిన 'ద రోలింగ్ లాంబ్స్' పుస్తకం ఎంపికైంది. బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో 'ద రోరింగ్ లాంబ్స్‌' ప్రజాదరణ పొందింది. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్‌లో అమెజాన్ సంస్థ ఓటింగ్ నిర్వహంచి ఫలితాలను ప్రకటించింది.

Most popular book: అమెజాన్‌ మోస్ట్ పాపులర్ బుక్‌-2021గా విశాఖ రచయిత పుస్తకం ఎంపిక
Most popular book: అమెజాన్‌ మోస్ట్ పాపులర్ బుక్‌-2021గా విశాఖ రచయిత పుస్తకం ఎంపిక

By

Published : Dec 31, 2021, 5:33 PM IST

Most popular book: విశాఖ వాసి శ్రీధర్ బెవర రాసిన 'ద రోలింగ్ లాంబ్స్' పుస్తకం అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ -2021కు ఎంపికైంది. బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో 'ద రోలింగ్ లాంబ్స్' పుస్తకం ప్రజాదరణ పొందింది. ఈ నెల 28 వరకు ఆన్​లైన్​లో అమెజాన్ సంస్థ ఓటింగ్ నిర్వహించింది. ఈ మేరకు అమెజాన్ సంస్థ కాసేపటి క్రితమే వెబ్​సైట్​లో ఫలితాలు వెల్లడించింది. ఈ విభాగంలో భారతీయ రచయిత శ్రీధర్ బెవర ఒక్కరే కావడం విశేషం.

ఐదు పుస్తకాల చొప్పున...

ఏటా అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్​గా ఎన్నిక చేసుకునేందుకు.. పాఠకుల నుంచి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇందులో పలు విభాగాలకు చెందిన పుస్తకాలను ఎంపిక చేశారు. భారతీయ భాషా కేటగిరి, పిల్లల విభాగం, రొమాన్స్, యంగ్ అడల్ట్, బయోగ్రఫీస్ అండ్ మెమోరీస్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్, క్రైం, థ్రిల్లర్ అండ్ మిస్టరీ, సెల్ఫ్ హెల్ఫ్, లిటరేచర్ అండ్ ఫిక్షన్ వంటి తొమ్మిది విభాగాల్లో ఐదేసి చొప్పున పుస్తకాలను ఎంపిక చేసి ఓటింగ్ కోసం ఉంచారు.

పోటీలో ప్రముఖ రచయితల పుస్తకాలు...

రాబిన్ శర్మ, చేతన్ భగత్, స్టీఫెన్ కింగ్, జెఫ్రీ ఆర్చర్, కెన్ ఫొల్లెట్, బ్రాడ్ స్టోన్, మాధ్యూ బ్రెనన్, కబీర్ బేడీ, ప్రియాంక చొప్రా జొనాస్, రెయిన్ బో రోవెల్, కొలిని హోవర్, రస్కిన్ బాండ్, సుధామూర్తి, మానవ్ కౌల్, సంజీవ్ పాలైవాల్ వంటి రచయితలు రాసిన పుసక్తాలూ పోటీ పడ్డాయి. ఇందులో తెలుగు వారు శ్రీధర్ బెవర రాసిన 'ది రోరింగ్ లాంబ్స్' పుస్తకం బిజినెస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో పోటీలో విజేతగా నిలిచింది. ఈ విభాగంలో భారతీయ రచయిత ఈయన ఒక్కరే కావడం విశేషం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details