కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి ఏపీలోని విశాఖపట్నం పోర్టు ట్రస్టు కోటీ రూపాయల సాయం అందించింది. తమ సామాజిక బాధ్యత నిధుల నుంచి కోటి రూపాయలతో పాటుగా పోర్ట్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం 62,28,296 రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామమోహనరావు వెల్లడించారు. పోర్టు నుంచి మొత్తం 1,62,28,296 రూపాయల మొత్తాన్ని పీఎం కేర్స్ నిధికి అందజేసినట్లు చెప్పారు. మరోవైపు పోర్టులో పదవీ విరమణ చేసిన అధికారులు తమ సంక్షేమ సంఘం తీర్మానం మేరకు తమ పింఛను నుంచి ఒక్కొక్కరు వెయ్యి రూపాయిలు విరాళం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ మొత్తాన్ని వారి వినతి మేరకు పీఎం కేర్స్‌కు అందేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ చైర్మన్ హరనాథ్ వెల్లడించారు.
పీఎం కేర్స్ నిధికి విశాఖ పోర్టు ట్రస్టు భారీ విరాళం - పీఎం కేర్స్‌కు విశాఖ పోర్టు విరాళం
పీఎం కేర్స్ నిధికి ఏపీలోని విశాఖ పోర్టు ట్రస్టు భారీ విరాళాన్ని ప్రకటించింది. సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.కోటితో పాటు ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.62,28,296ను విరాళంగా ఇచ్చినట్లు పోర్టు ఛైర్మన్ వెల్లడించారు. అంతేకాకుండా పదవీ విరమణ చేసిన అధికారులు పింఛన్ నుంచి ఒక్కొక్కరు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
![పీఎం కేర్స్ నిధికి విశాఖ పోర్టు ట్రస్టు భారీ విరాళం vishaka-port-trust-donates-one-crore-rupees-to-pm-cares-fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6989940-600-6989940-1588160618469.jpg)
పీఎం కేర్స్ నిధికి విశాఖ పోర్టు ట్రస్టు భారీ విరాళం