తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ ఒడ్డుకు కొట్టుకొచ్చిన నౌక ఆతిథ్యం ఇవ్వనుందా?

వాయుగుండం కారణంగా ఏపీలోని విశాఖకు కొట్టుకు వచ్చిన బంగ్లాదేశీ ఓడను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం భావిస్తోంది. తెన్నేటి పార్కు వద్దే ఓడను ఉంచి, రెస్టారెంట్​గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

విశాఖ ఒడ్డుకు కొట్టుకొచ్చిన నౌక ఆతిథ్యం ఇవ్వనుందా?
విశాఖ ఒడ్డుకు కొట్టుకొచ్చిన నౌక ఆతిథ్యం ఇవ్వనుందా?

By

Published : Dec 17, 2020, 10:00 AM IST

ఏపీలోని విశాఖలో తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకు వచ్చి నిలిచిపోయిన ఓడను కొనుగోలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి, రెస్టారెంట్​గా మార్చేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.

తీవ్ర వాయుగుండం కారణంగా అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్​కు చెందిన వాణిజ్య నౌక ఎంవీహెచ్​టీ 194 కార్గో విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది. తీరానికి దగ్గరలో రాళ్లు, ఇసుకలో కూరుకుపోవటంతో, ఓడను తిరిగి సముద్రంలోనిక తీసుకువెళ్లేందుకు వైజాగ్ పోర్టు ట్రస్టు ప్రయత్నాలు చేసింది. కార్గో నౌకను తిరిగి నీటిలోకి పంపేందుకు భారీ మెుత్తంలో ఖర్చు కానుండటంతో, ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి

కొట్టుకు వచ్చిన నౌకను ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, హోటల్​గా మార్చాలని భావించింది. ఈ విషయంపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ అధికారులతో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​ చర్చలు జరిపారు. ఓడ యజమానితో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.

ఓడను కొనుగోలు చేసిన తరువాత పర్యటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపైన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఓడ క్వార్ట్జ్, ఫ్లై యాష్​ను రవాణా చేస్తుంది. హోటల్​గా మార్చేందుకు, అంతర్గత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 80 మీటర్ల పొడవైన ఈ నౌకలో గదుల తరహా కంపార్ట్​మెంట్లు నిర్మాణానికి పెద్ద మెుత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత కథనం:విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ

ABOUT THE AUTHOR

...view details