సరకు రవాణాలో ఏపీలోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మంచి ప్రగతిని కనబర్చిందని.. పోర్ట్ చైర్మన్ రామ్మోహన్రావు తెలిపారు. కొవిడ్ సమయంలో.. పోర్ట్ యాజమాన్యం ప్రణాళికాబద్దంగా సరకు రవాణాకు కావాల్సిన చర్యలు చేపట్టి మంచి ఫలితాలను రాబట్టిందన్నారు.
సరకు రవాణాలో మూడో స్థానంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ - విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు దేశంలో మూడో స్థానం వార్తలు
ఏపీలోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్.. సరకు రవాణాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి.. 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిందని.. పోర్ట్ చైర్మన్ రామ్మోహన్రావు తెలిపారు.
![సరకు రవాణాలో మూడో స్థానంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ Visakhapatnam Port Trust sets a record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11263637-809-11263637-1617444236887.jpg)
Visakhapatnam Port Trust sets a record
2020-21 ఆర్థిక సంవత్సరానికి.. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 69.84 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి.. పోర్ట్ చరిత్రలో రెండవ అత్యున్నత సరకు రవాణా చేసినట్లు రికార్డు సృష్టించిందన్నారు. దేశంలోనే మేజర్ పోర్టులలో.. మూడవ స్థానంలో నిలిచామని రామ్మోహన్రావు తెలిపారు. లాక్డౌన్ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని.. గతేడాది కంటే కేవలం 3 మిలియన్ టన్నులు మాత్రమే తక్కువ రవాణా చేసిందని వివరించారు.