ఏపీలోని విశాఖకు ప్రపంచ స్మార్ట్‌సిటీ అవార్డుల పోటీలో.. తుది జాబితాలో చోటు దక్కిందని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ఆకర్షణీయ నగరాల ఎక్స్‌పోలో విశాఖ అద్భుత ప్రదర్శన ఇచ్చిందన్నారు. దివ్యాంగుల పార్కు ప్రాజెక్టుతో 46 దేశాల సరసన ప్రత్యేకంగా విశాఖ నిలిచిందని పేర్కొన్నారు.
'భారత్ నుంచి ఆ అవార్డుకు పోటీపడిన ఏకైక నగరం' - విశాఖపట్నం తాజా వార్తలు
ప్రపంచ స్మార్ట్‌సిటీ అవార్డుల పోటీల్లో ఏపీలోని విశాఖ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. దివ్యాంగుల పార్కు ప్రాజెక్టుతో 46 దేశాల సరసన ప్రత్యేకంగా విశాఖ నిలిచింది. భారత్ నుంచి ఈ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం వైజాగ్.
'భారత్ నుంచి ఆ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం'
దివ్యాంగులైన పిల్లల కోసం ప్రత్యేక పార్కు తీర్చిదిద్దడంతో విశాఖకు గుర్తింపు వచ్చిందన్నారు. భారత్ నుంచి ఈ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం విశాఖ అని తెలిపారు.
ఇదీ చదవండి:తుంగభద్ర పుష్కారాలు... సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు