తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులిస్తున్నారు: పవన్‌ కల్యాణ్‌

Police Notices to Pawan Kalyan: ఏపీలోని విశాఖలో సెక్షన్‌ 30 అమల్లో ఉన్నప్పుడు భారీ ర్యాలీ నిర్వహించినందుకు జనసేన అధినేత పవనకల్యాణ్​కు పోలీసులు నోటీసులు అందజేశారు. 500 మందికిపైగా ప్రజలతో ర్యాలీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులిస్తున్నారు: పవన్‌ కల్యాణ్‌
ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులిస్తున్నారు: పవన్‌ కల్యాణ్‌

By

Published : Oct 16, 2022, 2:45 PM IST

ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులిస్తున్నారు: పవన్‌ కల్యాణ్‌

Police Notices to Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర నోటీసులు అందజేశారు. సెక్షన్‌ 30 అమల్లో ఉన్నప్పుడు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. విశాఖలో 500 మందికి పైగా ప్రజలతో ర్యాలీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి:తాము విశాఖ రాక ముందే గొడవ జరిగిందని.. తాము వచ్చి రెచ్చగొట్టడం వల్లే జరిగిన విధంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని పవన్‌ పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా ఇతర పార్టీలు ఎదగడానికి సహకరించదని.. తమకు వస్తోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామనే కారణంతో డ్రోన్లను నిషేధించారని.. ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయని తెలిపారు. నేర చరిత గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలని సూచించారు. ప్రజల్లో మార్పు వచ్చే వరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు.

జనసేన కుటుంబాలకు ఆర్థిక సాయం:విశాఖలో మాట్లాడిన అనంతరం చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్​ ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details