విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ..ఉక్కు పరిరక్షణ సమితి నేతలు నిరసనకు (agitation over visakha steel plant privatization) దిగారు. ఏపీలోని విశాఖలో గల ఉక్కునగరం, కూర్మన్నపాలెం కూడలి, పెదగంట్యాడలో ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తెలుగుతల్లి విగ్రహం, టీటీఐ ప్రాంతాల్లోనూ వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక నేతలు..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు చట్టాల రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లే స్టీల్‌ప్లాంట్ పైనా ఆలోచించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.