ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో 10 మంది మృతదేహాలు కేజీహెచ్ శవాగారంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మృతదేహాలకు శుక్రవారం ఉదయం శవపరీక్ష నిర్వహిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో 316 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
విశాఖ ఘటన మృతదేహాలకు నేడు పోస్టుమార్టం - వైజాగ్ గ్యాస్ లీకేజీ తాజా వార్తలు
ఏపీలో విశాఖలో గురువారం తెల్లవారుజామున ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ‘స్టైరీన్’ విష వాయువు లీకైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
విశాఖ ఘటన మృతదేహాలకు నేడు పోస్టుమార్టం
కేజీహెచ్‌లో 193 మంది గ్యాస్ లీక్ బాధితులకు చికిత్స జరుగుతుండగా... ప్రైవేటు ఆస్పత్రుల్లో 66 మంది బాధితులు, గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో 57 మందికి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:అప్రమత్తత లోపించడమే గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణం: ఐఐపీఈ