తెలంగాణ

telangana

ETV Bharat / city

మావోయిస్టులకు ఉచితంగా కొవిడ్​ చికిత్స.. - తెలంగాణ వార్తలు

కరోనా కల్లోలం నేపథ్యంలో మావోలు సైతం కొవిడ్ బారిన పడుతున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్ర కాకముందే సరైన కాలంలో చికిత్స తీసుకోవాలంటూ ఏపీ పోలీసులు సూచిస్తున్నారు. అజ్ఞాత వాసం వీడి జనారణ్యంలోకి వచ్చి తగిన చికిత్స పొందాలని కోరుతున్నారు. మావోల ప్రాణాలకు తాము భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

free vaccination for Maoist, Maoist free vaccination
మావోయిస్టులకు ఉచిత టీకా, మావోలకు వ్యాక్సిన్

By

Published : May 11, 2021, 12:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ‘ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ( ఏఓబీ ) పరిధిలో తిరుగుతున్న మావోయిస్టుల్లో చాలా మంది కొవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది. గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్‌ ఏరియాలో దళ సభ్యుల్లో కొందరు ఒళ్లు నొప్పులు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. కరోనా బారినపడిన వారికి సరైన సమయంలో, సరైన చికిత్స అందకపోవడం వల్ల చనిపోవడం చూస్తున్నాం.

వెంటనే సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తాం..

మావోయిస్టులుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ కరోనా లక్షణాలతో బాధపడుతుంటే, వెంటనే సమాచారం ఇస్తే ఉచితంగా చికిత్స అందేలా ఏర్పాటు చేస్తాం’ అని విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

హాయిగా ఇంటికి వెళ్లండి..

సరైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశ్రయిస్తే మీ చికిత్సకు, మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ హామీ ఇచ్చారు. కోలుకున్నాక మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా ఇంటికి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి కూడా సోమవారం ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:దేశంలో వరుసగా రెండో రోజూ తగ్గిన కొవిడ్ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details