తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశ ఘనతను చాటుతూ రూపొందించిన ప్రత్యేక గీతానికి జేజేలు

Amrut Mahotsav Song: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు సమీపిస్తున్న వేళ దేశమంతా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మరికొన్ని సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిని చూసిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీరేంద్ర... తానూ ఉత్సవాల్లో భాగస్వామి కావాలని భావించారు. నేను సైతం పేరుతో దేశ గొప్పతనాన్ని వివరిస్తూ ప్రత్యేక గీతాన్ని రాసి దృశ్య రూపమిచ్చారు.

Amrut Mahotsav Song, Amrut Mahotsav 2022
దేశ ఘనతను చాటుతు రూపొందించిన ప్రత్యేక గీతానికి జేజేలు

By

Published : Jan 30, 2022, 12:24 PM IST

దేశ ఘనతను చాటుతు రూపొందించిన ప్రత్యేక గీతానికి జేజేలు

Amrut Mahotsav Song: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈమని వీరేంద్రప్రసాద్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట దేశమంతా జరుగుతున్న వేడుకలకు తనవంతుగా ఏదైనా చేయాలని వీరేంద్ర భావించారు. సాహిత్యంపై పట్టుండటంతో ప్రత్యేక గీతాన్ని రాయాలని సంకల్పించారు. ‘భగవద్గీత ఇండియా - భరత నాట్యం ఇండియా ’ అంటూ ఓ గేయాన్ని రాశారు. కేవలం పాటకే పరిమితం కాకుండా దానికి దృశ్యరూపం కల్పించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతానికి సంకేతంగా.. దేశ గొప్పదనాన్ని 75 అంశాల్లో వివరిస్తూ వీడియో గీతాన్ని రూపొందించారు.

కేవలం తెలుగు వారికి మాత్రమే కాకుండా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్ సైట్‌కు ఈ గీతాన్ని పంపించారు. అలాగే అందరూ వీక్షించేందుకు వీలుగా ‘వ్యాస్‌ మ్యూజిక్‌ వీరేంద్ర ’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి అందులో ఈ పాటను ఉంచారు. దేశం గొప్పదనం గురించి చెప్పటం భారతీయునిగా తన కర్తవ్యమని భావించి ఈ గీతాన్ని రూపొందించినట్లు వీరేంద్ర ప్రసాద్‌ చెబుతున్నారు.

వీరేంద్రప్రసాద్‌, ప్రత్యేక గీతం రూపకర్త దేశంలో ఉన్న సామాజిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ మంచి పాటల్ని రాయటం తన లక్ష్యమంటున్న వీరేంద్ర.....భవిష్యత్తులోనూ మరిన్ని స్ఫూర్తివంతమైన పాటలు రాస్తానని చెబుతున్నారు.

ఇదీ చదవండి:గాంధీజీ తన మరణాన్ని ఊహించారా?- ఆ మాటలు వింటే..

ABOUT THE AUTHOR

...view details