ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి భోజనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేటరింగ్ సిబ్బంది అంతా పీపీఈ కిట్లు ధరించి అతిథులకు భోజనం వడ్డించడం చూసి పెళ్లికొచ్చిన వారు ఆశ్చర్యపోయారు. తొలుత కరోనా రోగుల కోసం వచ్చారేమో అని కొందరు అనుకున్నారు. తర్వాత విషయం తెలుసుకొని నవ్వుకున్నారు. కరోనా కట్టడికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేటరింగ్ సిబ్బంది అభిప్రాయపడ్డారు.
వైరల్ వీడియో: పీపీఈ కిట్లు ధరించి పెళ్లి భోజనం...
కరోనా కారణంగా వివాహ తంతు కొత్తగా జరుగుతోంది. పెళ్లికొచ్చిన బంధువులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తుండటం చూసే ఉంటారు. అయితే కరోనా కట్టడికి ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ పెళ్లి భోజనంలో కేటరింగ్ సిబ్బంది చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.
వైరల్ వీడియో: పీపీఈ కిట్లు ధరించి పెళ్లి భోజనం వడ్డన