తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీనివాసుడి సేవలో .. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిలయన్స్ సీఈవో పీఎంఎస్. ప్రసాద్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Puvvada Ajay : తిరుమల శ్రీవారి సేవలో మంత్రి పువ్వాడ - తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల శ్రీవారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay), ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రిలయన్స్ సీఈవో పీఎంఎస్. ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. శ్రీవారిని శుక్రవారం 12, 415 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 8,046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని... శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లుగా సమకూరిందని వెల్లడించారు.
తిరుమల అనంతరం.. మంత్రి పువ్వాడ.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :అవునండీ.. చేప గుజ్జుతో చేసిన కేకులివి!