తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - ttd latest news

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Dec 13, 2020, 5:19 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మీ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ, మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావు... స్వామి సేవలో పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్‌రాజు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:తితిదే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details