Anand Mahindra on Wood Treadmill: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసి కడిపు శ్రీనివాస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విద్యుత్ అవసరం లేకుండా కలపతో ట్రెడ్‌మిల్ తయారు చేయడంతో ఇటు సామాన్యులు... అటు ప్రముఖులు ఆయనను అభినందిస్తున్నారు. పనితీరు భేష్ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ మెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం శ్రీనివాస్ పనితనాన్ని కొనియాడారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్ర పూర్తిగా కలపతో తయారు చేసిన ట్రెడ్ మిల్‌ను చూసి అద్భుతమన్నారు. "కలప ట్రెడ్ మిల్" తయారు చేసిన శ్రీనివాస్ ప్రతిభ బ్రహ్మాండమంటూ ట్వీట్ చేశారు.
Anand Mahindra on Wood Treadmill: 'కలప ట్రెడ్‌మిల్ ప్రతిభ బ్రహ్మాండం...నాకూ కావాలి' - ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ అప్డేట్స్
Anand Mahindra on Wood Treadmill: పూర్తిగా కలపతో ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన కడిపు శ్రీనివాస్ పనితీరుకు సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. శ్రీనివాస్ పనితీరును ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ మెచ్చుకోగా.... ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.
Anand Mahindra on Wood Treadmill: 'కలప ట్రెడ్‌మిల్ ప్రతిభ బ్రహ్మాండం...నాకూ కావాలి'
అంతా వ్యాపారమయమైన ప్రస్తుత ప్రపంచంలో, విద్యుత్‌తో నడిచే వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్న పరిస్థితుల్లో.. హస్తకళల సత్తా చాటేలా ఉన్న ఆయన ఆవిష్కరణ, సంకల్పం అద్భుతమన్నారు. గంటల తరబడి శ్రమించి కలపతో ట్రెడ్ మిల్ తయారుచేయడం అభినందనీయమన్నారు. ఇది కేవలం ట్రెడ్ మిల్ మాత్రమే కాదని.. హస్తకళల గొప్పదనానికి నిదర్శనమన్నారు. కలపతో తయారుచేసిన ట్రెడ్ మిల్ తనకూ కావాలంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: