కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి... పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు కొనసాగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన లేఖలో వెల్లడించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్‌కుమార్ లేఖ
కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని లేఖలో కోరారు. పెండింగ్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.
vinod kumar letter to central education minister ramesh pokhriyal
రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 1,218 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా... అందులో 959 రెగ్యులర్, 131 పోస్టులు కాంట్రాక్టని తెలిపారు. ఇంకా 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థులకు విద్యా బోధన సరిగ్గా సాగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వివరించారు.