ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏనుగుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. బూర్జపాడులో నిన్న రాత్రి వరికుప్పలపైనుంచి వెళ్లి పంట నాశనం చేయగా.. రైతులు లబోదిబోమంటున్నారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు - ఏపీ వార్తలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైతులను ఏనుగుల గుంపు వణికిస్తోంది. వరి కుప్పలపై నుంచి ఆ గుంపు వెళ్లిన కారణంగా.. పంటంతా నాశనమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
![పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు villagers-feared-with-elephants-attacks-on-crops-at-burjupadu in srikakulam AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10029153-28-10029153-1609089452309.jpg)
పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు
పంటలపై ఏనుగులదాడి... ఆందోళనలో రైతులు
కాశీబుగ్గ రేంజ్ అటవీ అధికారి పి. అమ్మనునాయుడు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏనుగుల గుంపు కోసం అన్వేషణ ప్రారంభించారు. అడుగుల ఆధారంగా 4 పెద్దవి, ఒక పిల్ల ఏనుగు సంచరిస్తున్నట్టు గుర్తించారు. సన్యాసి పుట్టుగ, కేశపురం, డొంకూరు, చిన్న పెద్ద లక్ష్మీపురాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపును ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.